బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రకుల్ ప్రీత్

రకుల్ ప్రీత్ సింగ్, ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి పొజిషన్ లో ఉన్న హీరోయిన్. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో ఛాన్స్ లు తగ్గిపోవడంతో అమ్మడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. అడపా దడపా హిందీ సినిమాలు చేస్తున్న ఈమెకి స్టార్ స్టేటస్ మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఎటాక్, మేడే, థాంక్ గాడ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమాలు హిట్టయితే రకుల్ ప్రీత్ కి వెనక్కి చూసుకోనక్కర్లేదు. ఇక తెలుగులో క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించిన సినిమా విడుదల కావాల్సి ఉంది. తమిళ్ లో కమల్ హాసన్ తో ఇండియన్2 లో నటిస్తుంది.