బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తాజాగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో పెద్దగా బజ్ లేదు. అయినా కూడా చిత్రం సినీ వర్గాల్లో మంచి అంచనాలను కలిగి ఉంది. తమిళ రీమేక్ అయినప్పటికి ఈ చిత్రం బిజినెస్ భారీగా జరిగింది. అనూహ్యంగా ఈ చిత్రం 20 కోట్ల లోపు బడ్జెట్తో రూపొందితే అన్ని రకాల బిజినెస్ల ద్వారా నిర్మాత ఖాతాలోకి ఏకంగా 35 కోట్ల వరకు వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
‘రాక్షసుడు’ ప్రీ రిలీజ్ బిజినెస్ :
నైజాం : 5.5 కోట్లు
సీడెడ్ : 2 కోట్లు
వైజాగ్ : 1.5 కోట్లు
ఈస్ట్ : 95 లక్షలు
వెస్ట్ : 85 లక్షలు
కృష్ణ : 1 కోట్లు
గుంటూరు : 1.2 కోట్లు
నెల్లూరు : 50 లక్షలు
కర్ణాటక : 1.1 కోట్లు
ఇతరం : 70 లక్షలు
ఓవర్సీస్ : 70 లక్షలు
శాటిలైట్ రైట్స్ : 6 కోట్లు
హిందీ డబ్బింగ్ రైట్స్ మరియు ప్రైమ్ వీడియో రైట్స్ : 12.5 కోట్లు
ఇతరం : 50 లక్షలు