రాజు కాళ్ళ దగ్గరికి విజయ్..?

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాత అంటే ఎవరైనా దిల్ రాజు పేరే చెపుతారు. కథ దగ్గరి నుండి మొదలు పెడితే సినిమా రిలీజ్ అయి దాని ప్రచారం వరకు రాజు అన్నింట్లోనూ దిట్ట. అందుకే ఆయనతో సినిమా అంటే మన హీరోలు ఏమాత్రం ఆలోచించకుండా ఒకే చెపుతారు. అలాంటిది క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మాత్రం మొన్నటి వరకు పట్టించుకోలేదని..రాజు గారు ఓ సినిమా చేద్దాం విజయ్ అని ఎంత అడిగిన లైట్ తీసుకున్నాడని మొన్నటి వరకు తెగ ప్రచారం అయ్యింది. ఇక ఇప్పుడు డియర్ కామ్రేడ్ ప్లాప్ కావడం తో విజయ్ రాజు గారి కాళ్ళ దగ్గరకు వచ్చాడని అంటున్నారు.

రెండురోజులు దిల్ రాజు ఆఫీసుకు విజయ్ వచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. ‘అన్నా..కాస్త వ్యవహారాలన్నీ గజిబిజిగా వున్నాయి. అన్నీ సెటిల్ చేయాల్సివుంది. వారం పదిరోజుల్లో అన్నీ కొలిక్కి వస్తాయి. అప్పుడు మనం కూర్చుని ప్రాజెక్టు ఫైనల్ చేసుకుందాం’ అనే రీతిలో దిల్ రాజుతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్ ప్లాప్ కావడం..సెట్స్ ఫై ఉన్న హీరో సినిమా ఆగిపోవడం.. మైత్రీవాళ్లు మరో సినిమా చేయమని చెప్పడం తో.. అవన్నీ ఫైనల్ అయిన తరువాత మంచి ప్రాజెక్టు మనం చేద్దాం…” అని విజయ్ దిల్ రాజు కు చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తం మీద కష్టం వచ్చినప్పుడు కానీ దిల్ రాజు విజయ్ కి గుర్తుకు రాలేదన్నమాట.