Site icon TeluguMirchi.com

మ‌ల్టీస్టార‌ర్ కు నాన్న దొరికేశాడ ?

trayamవెంక‌టేష్, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం రూపుదిద్దుకోనుంది. కృష్ణవంశీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తారు. బండ్ల గ‌ణేష్ నిర్మాత‌. వెంక‌టేష్, రామ్‌చ‌ర‌ణ్ లతో పాటు మరో కీలక పాత్ర ను దర్శకుడు కృష్ణ వంశి ఈ చిత్రం కోసం క్రియేట్ చేశాడు. ఆ పాత్ర కోసం ముందుగా సూపర్ స్టార్ కృష్ణ పేరుని పరిశీలించారు.కాని కుదరలేదు. ఇప్పుడు ఈ పాత్రలో తమిళ నటుడు రాజ్ కిరణ్ పేరు వినిపిస్తోంది. దర్శకుడు వంశి ఈ పేరుని ఫైనల్ చేశారట. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, వెంకీలకు రాజ్ కిరణ్ తండ్రి గా కనిపిస్తారని వినిపిస్తోంది. ‘పందెం కోడి’, ‘ముని’ సినిమాల ద్వారా రాజ్ కిరణ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం. జనవరి నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

Exit mobile version