కాన్స్ లో కనిపించని రజినీ

rajinikanthసూపర్ స్టార్ రజినీ కాన్స్‌ రెడ్ కార్పెట్ పై తనదైన మేనరిజం తో నడుస్తారని ఆసక్తి తో ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. రజనీ చేతుల మీదిగా ‘కోచ్చడయాన్‌’కి సంబంధించిన ప్రచార చిత్రాల్ని కాన్స్‌లో విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్ సమయానికి చిత్రాల రూపకల్పన పూర్తి చేయలేక పోయింది. దింతో రజినీ కాన్స్‌ పర్యటన రద్దయింది. ఈ విషయమై దర్శకురాలు సౌందర్య ట్వీట్ చేస్తూ… ”ప్రచార చిత్రం అందర్నీ ఆశ్చర్యపరచేలా రూపొందుతోంది. త్వరలోనే అందరికీ చూపిస్తా ము”అని ట్విట్టర్‌లోతెలిపింది. వచ్చే నెల మొదటి వారంలో ‘కోచ్చడయాన్‌ ట్రైలర్స్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.