కల్యాణ్‌రామ్ నటిస్తూ నిర్మించిన చిత్రం ఓమ్. త్రీడీ సాంకేతిక హంగులతో తీర్చిదిద్దిన ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. ఈనెల 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని చెన్నైలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రత్యేకంగా తిలకించారు. ”ఆమధ్య అవతార్ చూశా. అప్పుడు ఎంత థ్రిల్‌కి గురయ్యానో ఇప్పుడు ఓమ్ సినిమా చూసినప్పుడూ అలానే అనిపించింది. పరిమిత బడ్జెట్లో క్వాలిటీ మేకింగ్‌తో తీసిన సినిమా ఇది. కల్యాణ్‌రామ్ నటన, ఫైట్స్ నాకు బాగా నచ్చాయి. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంది. తప్పకుండా మంచి విజయం సాధించాలి” అని రజనీ ఆకాంక్షించారు. రజనీ దీవెనలు కల్యాణ్‌రామ్‌కి ఉత్సాహాన్ని అందించాయి. ”రజనీకి నచ్చడం నా అదృష్టం. తాతయ్యే దిగి వచ్చి ఆశీర్వాదం ఇచ్చినట్టైంది…” అంటున్నారాయన.