సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అని గతకొంత కాలంగా తారా స్థాయిలో ప్రచారం అవుతూ వస్తోంది. కానీ ఈ విషయమై రజినీకాంత్ మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు. ఆర్కేనగర్ నుండి రజినీ పోటీ చేస్తాడు అని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. ఆ తర్వాత ఈ వార్తలకు తెరపడిరది. అనంతరం రజినీకాంత్ ప్రధాని మోడీని కలిశాడు. దాంతో రజినీ భాజాపా నుండి పోటీలోకి దిగుతున్నాడు అని వార్తలు వచ్చాయి. రజినీ మోడీని అందుకే కలిశాడా..?? లేదా వేరే విషయమా.?? అనేది పెద్ద చర్చ జరిగినా కూడా రజినీ వర్గం నుండి ఎటువంటి క్లారిటీ లేదు.
తాజాగా ఆర్కేనగర్ ఉప ఎన్నికలో భాజాపా నుండి పోటీ చేసే అభ్యర్థి గంగై అమరన్ తాజాగా రజినీని కలిశాడు. త్వరలో ఎన్నికల బరిలో దిగనున్న అమరన్ రజినీని ఈ సమయంలో ఎందుకు కలిశాడు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గోనడానికా..? లేదా ఈ సమయంలో రజినీ భాజాపాలో అరంగేట్రం చేస్తాడా..?? అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. తమిళ రాజకీయాల్లో సూపర్‌స్టార్ అడుగు అనేది చాలా ప్రభావం చూపుతుంది. అందుకే రజినీ రాజకీయ చర్చకు ఈ సమావేశంతో మరోసారి తెర లేచింది.