ఈసారైన వస్తాడా??

rajinikanthసూపర్ స్టార్ రజినీకాంత్ ‘కొచ్చాడియన్’ దీపావళి కి రెడీ అయింది. సుమారుగా 150కోట్లు తో తెరకిక్కిన ఈ చిత్రంకు ఐశ్వర్య రజీని కాంత్ దర్శకత్వం వహించారు. రజీని సరసన బాలీవుడ్ ముద్దు గుమ్మ దీపిక పడుకొనే నటించిన ఈ చిత్రంకు ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రముఖ బ్యానర్ శ్రీ లక్ష్మి గణపతి ఫిల్మ్స్ “కొచ్చాడియన్” చిత్ర డబ్బింగ్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘విక్రమ సింహా’ గా రిలీజ్ కానున్న ఈ చిత్రంకు “మొజార్ట్ అఫ్ మద్రాస్” ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. త్వరలోనే ఆడియో విడుదల చేస్తారు. అవతార్, టిన్‌టిన్‌ లాంటి హాలీవుడ్ చిత్రాలకు ఉపయోగించిన ‘మోషన్ కాప్చరింగ్’ టెక్నాలజీతో ఈ చిత్రం తెరకిక్కించారు. ఇప్పటికే అనేక మార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఈ దీపావళి కైన రావాలని రజీని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.