Site icon TeluguMirchi.com

కాలా ముందుకు రోబో వెనక్కి


సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ లేటెస్ట్ చిత్రం ‘కాలా’. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రజనీకి జోడీగా బాలీవుడ్‌ నటి హ్యుమా ఖురేషీ నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ఐయింది. ఈ సినిమా ఏప్రిల్‌ 27న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత, రజనీ అల్లుడు ధనుష్‌ శనివారం అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీతో కూడిన ‘కాలా’ పోస్టర్లు రిలీజ్‌ చేశారు.

నిజానికి ఏప్రిల్‌ 27న శంకర్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 2.0 సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ జాప్యం వల్ల ఆ సినిమా వెనక్కి వెళ్లి కాలా ముందుకు వచ్చింది. కాగా 2.0 రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. రజనీకాంత్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి.

Exit mobile version