Site icon TeluguMirchi.com

‘జైలర్’ షోకేస్.. నెల్సన్ స్టైల్‌లో రజనీ అదరగొట్టాడు


తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న మూవీ ‘జైలర్’. ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మిర్నా మీనన్, సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ‘జైలర్ షోకేస్’ పేరుతో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ తెలుగు వెర్షన్ ను నాగచైతన్య విడుదల చేసాడు.

ఇక జైలర్ షోకేస్ అయితే పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. ఇక రజనీకాంత్ మరోసారి తన మార్క్ స్టైల్, స్వాగ్ తో అదరగొట్టేసాడు. ‘ఒకరేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు.. కోతలే’ అంటూ రజినీకాంత్ చెప్పే డైలాగ్ బావుంటుంది. అనిరుధ్ రవిచందర్ బ్యాక్‍గ్రౌండ్ స్కోర్ అదుర్స్. ఇక హుకుం అంటూ రజినీ చెప్పే డైలాగ్‍తో షోకేస్ ముగిసింది. ఇకపోతే ఈ షోకేస్ సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను అమాంతంగా పెంచేసింది. మొత్తానికి జైలర్ షోకేస్ ఓ రేంజ్ లో వుంది.

JAILER - Official ShowCase (Telugu) | Superstar Rajinikanth | Sun Pictures | Anirudh | Nelson

Exit mobile version