సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య మరియు ఆమె భర్త తాజాగా లండన్ వెళ్లారు. అక్కడ దిగి దిగగానే ఒక సూట్ కేసును పోగొట్టుకున్నారు. ఆ సూట్‌కేసులో వారిద్దరి పాస్ పోర్ట్‌లు మరియు అమెరికన్ డాలర్లు ఉన్నాయి. పాస్‌పోర్ట్‌లు లేకపోవడంతో వారిద్దరిని అక్కడ నుండి పంపించడం కుదరదంటూ లండన్ ఎయిర్ పోర్న్ సిబ్బంది గెస్ట్ రూంకు పంపించారు. విషయం రజినీకాంత్‌కు చేరడంతో ఆయన విదేశాంగ శాఖతో మాట్లాడి అక్కడి ఇండియన్ అంబసీతో చర్చించారు.
లండన్‌లోని ఇండియన్ అంబసీ ప్రతినిధులు కొన్ని గంటల వ్యవధిలో అక్కడకు వెళ్లి డూప్లికేట్ పాస్‌పోర్ట్‌లను అందించారు. దాంతో సౌందర్య దంపతులు ఎయిర్ పోర్ట్ నుండి బయట పడ్డారు. కొన్ని గంటల పాటు చాలా ఇబ్బంది పడ్డట్లుగా వారు పేర్కొన్నారు. ఇది జరిగి దాదాపుగా వారం కావస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. తాజాగా సౌందర్య దంపతులు ఇండియా చేరుకున్నారు. వెళ్లిన సమయంలో ఆ చేదు సంఘటన జరిగిందట.