సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘రోబో’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘రోబో 2.0’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ నటిస్తుండగా అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ చివరి షూడ్యూల్ ముగింపు దశకు చేరుకుంది. ఇక బిజినెస్ పనులు ప్రారంభం అయ్యాయి. ఊహించని రేటుకు ఈ చిత్ర శాటిలైట్ హక్కులు అమ్ముడయ్యాయి.
ఓ ప్రముఖ టీవీ ఛానెల్ వారు ‘రోబో 2.0’ చిత్రాన్ని 110కోట్లు వెచ్చించి కొనగోలు చేశారు. అంత భారీ మొత్తంను వెచ్చించి కొనుగోలు చేసిన శాటిలైట్ హక్కులు తెలుగు, తమిళ, హిందీ భాషలను కుపుకుని చెల్లించారని ఈ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ పూర్తి అవుతుండగానే నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుతున్నారు చిత్ర యూనిట్. ‘రోబో’కు సీక్వెల్ కావున ఈ చిత్రంపై రజినీ అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.