అవినీతిపై పోరాటం చేస్తున్న ర‌జ‌నీ

rajinikanthశివాజీ, రోబోల త‌ర‌వాత ర‌జ‌నీకాంత్‌- శంక‌ర్‌ల క‌ల‌యిక హ్యాట్రిక్‌కొట్టడానికి సిద్ధమైంది. ర‌జ‌నీతో ఓ సినిమా చేయ‌డానికి శంక‌ర్ క‌స‌ర‌త్తులు మొద‌లెట్టేశారు. ప్రస్తుతం ఆయ‌న మ‌నోహ‌రుడు (ఐ) చిత్రీక‌ర‌ణ‌లో ఉన్నారు. దానితో పాటు ర‌జ‌నీ కోసం కూడా క‌థ సిద్ధం చేస్తున్నారు. అవినీతి, లంచ‌గొండిత‌నం నేప‌థ్యంలో సాగే సినిమా ఇద‌ని తెలుస్తోంది. శివాజీ విద్యావ్యవస్థ నేప‌థ్యంలో సాగింది. ఈ కొత్త సినిమాలో మాత్రం అన్నిర‌కాల సామాజిక అంశాల‌ను ప్రస్తావిస్తార‌ని తెలుస్తోంది. ఓ సామాన్యుడు త‌ల‌చుకొంటే ఏం జ‌రుగుతుందో ఈ సినిమాలో చూపించ‌నున్నార‌ట‌. మ‌రి ఈ చిత్రం ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి.