Site icon TeluguMirchi.com

‘కబాలి’ లో రజని ఇంట్రడక్ష్యన్ సీన్ లీకయ్యింది…

Kabali-Lek5

రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణం లో చిత్రంలోని రజనీకాంత్ ఇంట్రడక్ష్యన్ సీన్ నెట్ లో లీక్ చేసారు. వారం రోజుల క్రితం కూడా సినిమా లీకయ్యిందనే ప్రచారం జరుగగా నిర్మాతలు దానిని ఖండించారు. తాజాగా 2 నిమిషాల నిడివి గల రజని ఇంట్రడక్ష్యన్ సీన్ లీక్ అవడం తో అభిమానులలో ఖంగారు పుడుతుంది. ఈ సీన్ లో రజినీ కాంత్ మొదట జైల్లో ఒక పుస్తకం చదువుతూ ఉన్న సీన్ తో సినిమా మొదలవుతుంది.

ఆ తరువాత అయన శిక్ష పూర్తి అయ్యిందని పోలీస్ చెప్పగానే… అయన తన రూమ్ నుంచి స్టైల్ గా బయటికి వస్తాడు. బ్లూ డ్రెస్ వేసుకున్న రజినీ ఆ అతరువాత జైలు పుస్తకంలో సంతకం పెడతాడు. అక్కడి నుంచి తన వస్తువులు తీసుకుని తానే షూస్ ని క్లీన్ చేసుకుని… వాచ్, కోటు ధరించి అంతే స్టైల్ గా బయటికి వస్తాడు. నిజానికి జైలు కూడా చాలా రిచ్ గా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

దీంతో కబాలిఫుల్ మూవీ లీక్ కాలేదని నిర్మాతలు చెప్పిన విషయం అబద్దమనే తేలిపోయింది. మరి రేపటి కల్లా ఫుల్ మూవీ వస్తుందేమో అని అందరూ షాక్ అవుతున్నారు.

Exit mobile version