Site icon TeluguMirchi.com

ద్

rajini-amitabసూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ మూవీ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పరచింది. ఈ అరుదైన అవకాశం లభించడం రజినీకి ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా రజినీ గారాలపట్టి సౌందర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కొచ్చాడియాన్’ మూవీ ట్రైలర్‍‌ ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ‘కొచ్చాడియాన్’ సినిమాను ప్రచారం చేసేందుకు కేన్స్ మంచి వేదిక అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం లో దీపిక పడుకొనె, జాకీ ష్రాఫ్, శోభన, ఆర్ శరత్ కుమార్ తదితరులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. మే 15 నుంచి మే 26 వరకు జరగనున్న ఈ మూవీ పెస్టివల్ లో రజనీకాంత్ తో పాటు అమితాబ్ వచ్చన్ ఈ వేడుకకు హాజరు కానున్నారు. అమితాబ్ బచ్చన్ నటిస్తున్న హాలీవుడ్ మూవీ లియోనార్డో డికాప్రియో సినిమా ‘ది గ్రేట్ గట్స్ బై’ లో కీలకపాత్ర పోషిస్తున్నందుకు కేన్స్ నుండి ఈ ఆహ్వానాన్ని అందుకున్నారు.

Exit mobile version