యాంగ్రీయంగ్ మన్ రాజశేఖర్ ‘గరుడవేగ’ చిత్రంకు ముందు హీరోగా సినిమాలు చేయడం మానేయాలనుకున్నాడు. అయితే అదృష్టం కొద్ది గరుడవేగ చిత్రం సక్సెస్ అవ్వడంతో మరికొంత కాలం హీరోగానే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల ఈయన చేసిన కల్కి చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఆ సినిమా ఫలితం తర్వాత రాజశేఖర్ ఇక హీరోగా సినిమాలు చేయడం మానేస్తాడేమో అని అంతా అనుకున్నారు. కాని కల్కి ఫలితంను పట్టించుకోకుండా మరో సినిమాలో హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈసారి ఒక విభిన్నమైన కన్నడ సినిమాను ఈయన రీమేక్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
కన్నడంలో సూపర్ హిట్ అయిన ఒక చిత్రంను ఇప్పటికే రైట్స్ తీసుకోవడం జరిగిందట. తనకు సన్నిహితుడు అయిన తమిళ నిర్మాత ధనుంజయతో ఈ చిత్రం రీమేక్ రైట్స్‌ను కొనుగోలు చేయించాడు. ఆ సినిమా రీమేక్‌కు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ ఏడాది చివరి వరకు సినిమాను పట్టాలెక్కించి వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను విభిన్నమైన నేపథ్యంలో తెరకెక్కించే ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ నిర్మాత ధనుంజయ చెబుతున్నాడు. అయితే ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రంపై ఆసక్తిని కలిగి లేరు. ఎందుకంటే రాజశేఖర్ హీరోగా సినిమాలు చేయడం ఇక వృదా అంటూ అందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రాజశేఖర్ ఈ ప్రయత్నం అయినా ప్రేక్షకుల్లో ఉన్న ఆ ఆలోచనను తొలగిస్తుందా చూడాలి.