టీచర్ గా వస్తున్నాడు

1774-Rajasekhar.పవర్ పుల్ పోలీసు ఆఫీసర్ గా తన యాంగ్రీ యాక్షన్ తో ఆకట్టుకొనే రాజశేఖర్ ఇప్పుడు రూటు మార్చాడు. ఈ సారి యాక్షన్ ను పక్కన పెట్టి ఓ సాఫ్ట్ రోల్ తో వస్తున్నాడు. ఓ పల్లెటూరిలో తన కెదురైన సవాళ్ళను అధిగమించి, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే ఉపాధ్యాయుడి పాత్రలో కనిపిస్తాడు. తమిళ చిత్రం ‘సత్తయ్’ ఆదారంగా ఈ చిత్రాన్ని తెలుగులో నిరిమిస్తున్నారు. తమిళ్ లో సముద్రకని హీరో గా నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రసంశలను అందుకోవడం తో పాటు ఆవార్డులను సొంతం చేసుకుంది. చాల కాలం నుండి సరైన విజయం లేక డీలా పడిన రాజశేఖర్ ఈ చిత్రం పై ప్రత్యేక దృష్టి పెట్టి తెలుగు నేటివిటి తగిన విదంగా స్క్రీప్ట్ లో మార్పులు చేస్తున్నారు . ఈ చిత్రానికి సంభందించి త్వరలోనే అధికార ప్రకటన రానుంది.