Site icon TeluguMirchi.com

చిరు హీరో… రాజ‌శేఖ‌ర్ విల‌న్‌

chiru
చిరంజీవి హీరోగా న‌టించే సినిమాలో రాజ‌శేఖ‌ర్ విల‌న్‌గా క‌నిపిస్తే ఎలా ఉంటుంది..?? టామ్ అండ్ జ‌ర్రీల పోరాటం ప్రేక్షకులు హాయిగా చూసేయొచ్చు. ఈ ఆలోచ‌న ద‌ర్శకుల‌కూ, చిరుకీ వ‌చ్చిందో లేదో తెలీదుగానీ…. రాజశేఖ‌ర్‌కి మాత్రం వ‌చ్చింది. నేటి త‌రం క‌థానాయ‌కులలో ఎవ‌రితో క‌ల‌సి న‌టించాల‌ని వుంది?? అని అడిగితే…. ”చిరంజీవితో చేయాల‌ని వుంది. ఆయ‌న హీరో.. నేను విల‌న్‌. అయితే మా ఇద్దరి పాత్రల‌కూ స‌మాన ప్రాధాన్యం ఉండాలి…” అంటూ ష‌ర‌తు పెట్టారు రాజ‌శేఖ‌ర్‌. కొన్నాళ్ల క్రితం నుంచీ.. రాజ‌శేఖ‌ర్ – చిరంజీవి అభిమానుల మ‌ధ్య ప్రత్యన్న యుద్దం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇలాంట‌ప్పుడు యాంగ్రీ యంగ్ మెన్ ఇలాంటి కోరిక ఎందుకు కోరాడో..!

Exit mobile version