Site icon TeluguMirchi.com

పోలీసా..? మెకానిక్కా..?

rajasekharరాంగోపాల్‌వ‌ర్మ‌- రాజ‌శేఖ‌ర్‌.. గ‌త కొన్ని రోజులుగా ఈ కాంబినేష‌న్ గురించి చిత్రసీమ‌లో ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకొంటున్నారు. వర్మ రాజ‌శేఖ‌ర్‌ తో ఓ సినిమా చేస్తున్నాడ‌ని కొంత‌మంది, లేదు.. ఆ సినిమా పూర్తయిపోయింది. ప‌ది హేను రోజుల్లో సినిమా అంతా తీసేశాడ‌ని ఇంకొంత‌మంది చెప్పుకొంటున్నారు. రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాలో పోలీస్‌ గా న‌టించ‌డాని కొంద‌రంటే, ఇంకొంద‌రు.. ఈ సినిమాలో అత‌నిది మెకానిక్ పాత్ర అని చెబుతున్నారు. ఇది దెయ్యం క‌థా..? లేదంటే పోలీస్ స్టోరీనా..?? అనేది ఇంకా స‌స్పెన్సే. సినిమా తీసే ముందూ, ఆ త‌ర‌వాత త‌గినంద ప్రచారం చేసుకొనే వ‌ర్మ‌.. ఈ సినిమా విష‌యంలో ఎందుకు కామ్ అయిపోయాడో అర్థం కావ‌డం లేదు. తానే ఫ్లాపుల్లో ఉన్నాడు, ఇంకో ఫ్లాప్ హీరోతో ఈ సాహ‌సాలు ఎందుకు చేస్తున్నాడో సినీ జ‌నాల‌కు అర్థం కావ‌డం లేదు. వ‌ర్మకైనా అర్థమ‌య్యిందో, లేదో..?!

Exit mobile version