Site icon TeluguMirchi.com

ఇష్టం లేని పని చేసిన రజనీకాంత్ ..ఎందుకంటే ..

సూపర్ స్టార్ రజనీకాంత్ దూకుడు పెంచాడు. తన వయసును ఏమాత్రం లెక్క చేయకుండా యంగ్ జనరేషన్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఓ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో సినిమాను లైన్ లో పెడుతూ అభిమానుల్లో సంబరాలు నింపుతున్నాడు. తాజాగా ఈయన నటించిన దర్బార్ చిత్రం విడుదల కు సిద్ధమైంది. మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ తాలూకా ట్రైలర్ సోమవారం విడుదల అయ్యింది.

ఈ ట్రైలర్ విడుదల కార్య క్రమంలో డైరెక్టర్ మురుగదాస్ , విలన్ గా నటించిన సునీల్ శెట్టి , రజనీకాంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. ‘‘నిజానికి పోలీస్ పాత్రలు చేయడం నాకు ఇష్టముండదు. ఎందుకంటే ఈ పాత్ర చేసేటప్పుడు చాలా ఎక్కువ బాధ్యతాయుతంగా ఉండాలి. నాకు చాలా సులభంగా చేసే పాత్రలంటే ఇష్టం. కానీ, ఏఆర్ మురుగదాస్ ఒక వైవిధ్యమైన కథతో నా దగ్గరకు వచ్చారు. ఇది రెగ్యులర్ పోలీస్ క్యారెక్టర్ కాదు. చాలా తేడాగా ఉంటుంది. అతని విజువలైజేషన్, ఇమేజినేషన్ చాలా డిఫరెంట్’’ అని చెప్పుకొచ్చారు.

అలాగే తనను సూపర్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో..అది ఎలా వచ్చిందో అనే వివరాలు కూడా మీడియా తో పంచుకున్నారు. సుమారు 40 ఏళ్ల క్రితం. 1980 ప్రారంభంలో అనుకుంటా నేను నా సినిమాను థియేటర్‌లో చూస్తున్నాను. పేర్లు వస్తున్నాయి. తెరపై ‘సూపర్ స్టార్ రజినీకాంత్’ అని వచ్చింది. వెంటనే నిర్మాతను పిలిచి నన్ను అడగకుండా నా పేరు ముందు అలా ఎందుకు పెట్టారు అని ప్రశ్నించాను. సమాధానం లేదు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు నన్ను సూపర్ స్టార్ అని పిలుస్తారని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటికీ అదే ఫీల్‌లో ఉన్నాను. అసలు నేను సూపర్ స్టార్ ఎలా అయ్యానో నాకే తెలీదు అని చెప్పుకొచ్చారు.

Exit mobile version