Site icon TeluguMirchi.com

కొలవరి రికార్డ్ బ్రేక్ కానుంది!

rajiniతన యాక్షన్, స్టైల్, మేనరిజంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రజినీ ఇప్పుడు సింగర్ గా అలరించ బోతున్నారు. రజినీ నటిస్తున్న కొచ్చాడియాన్ చిత్రం కోసం ఓ పాట పాడారు సూపర్ స్టార్. రజినీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మ్యూజిక్ రెహమాన్. రజనీకాంత్ విశ్వసించే నమ్మకాలను పై ఇర్షాద్ కమిల్ ఓ పాటని రాశారు. ఆ పాటని రజనీ పాడితే బాగుంటుందని బావించిన రెహమాన్ పట్టుబట్టి ఆయనచేతే పాడించారు. ఈ సాంగ్ ను రెహ్మాన్ ప్రత్యేక శ్రద్ద తీసుకోని కంపోజ్ చేశారు. పైగా రజినీ ఇచ్చిన అవుట్ పుట్ పై ఫుల్ హ్యాపీ గా వున్నాడు రెహ్మాన్. మరో వైపు ఈ సాంగ్ రజినీ అల్లుడు ధనుష్ పాడిన కొలవరి సాంగ్ కు ధీటుగా నిలుస్తుందని కోలివుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఆగస్ట్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version