మున్నా భాయ్ ని కలసిన శివాజీ

rajanikanth-meets-sanjay-duttమున్నా భాయ్ సంజయ్‌దత్‌ చెన్నైలో తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను కలుసుకున్నారు. సంజయ్ దత్‌, ‘పోలీస్‌గిరి’ అనే సినిమా షూటింగ్‌కోసం చెన్నైలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం తెలుసుకున్న రజనీ.. సంజును, ఆ సినిమా దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ను తన ఇంటికి ఆహ్వానించారు. రజనీ ఆహ్వానాన్ని మన్నించి దత్‌, దర్శకుడు రవికుమార్‌తో కలిసి ఆయన ఇంటికి వెళ్ళారు. రజనీకాంత్‌కు సంజయ్‌ దత్‌ తండ్రి సునీల్‌ దత్‌తో, ఆయన కుటుంబంతో చాలాకాలంనుంచి మంచి అనుబంధంవున్న సంగతి తెలిసిందే. ఈ తాజా
భేటీపై సంజు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే… బాలకృష్ణ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం లక్ష్మీ నరసింహ ను ఇప్పుడు బాలీవుడ్ ‘పోలీస్‌గిరి’ పేరిట అనువాదిస్తున్నారు. ఈ చిత్రంతో కెఎస్ రవికుమార్ బాలీవుడ్ రంగప్రవేశం చేస్తున్నారు. బాలకృష్ణ చేసిన పోలీస్ అధికారి పాత్రను సంజయ్ దత్ చేస్తుండగా ‘కొలవరి డీ’ పాట తో పాపులర్ అయిన అనిరుధ్ ఈ చిత్రానికి మ్యూజిక్ సమకూరుస్తున్నారు.