Site icon TeluguMirchi.com

నయన్ ఫై రజనీ సీరియస్..కారణం అతడే

సూపర్ స్టార్ రజనీకాంత్ చాల కూల్ గా ఉంటారు. చిత్ర సెట్ లోను తన పక్కన నటించే వారితో దగ్గరి నుండి సెట్ లో పనిచేసి లైట్ మెన్ దగ్గరి వరకు అందరితో చాల సన్నిహితంగా ఉంటూ వారి మంచి చెడులు అడిగి తెలుసుకుంటుంటాడు. అలాంటిది హీరోయిన్ నయనతార ఫై కాస్త సీరియస్ అయినట్లు కోలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం వీరిద్దరూ కలిసి దర్బార్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెట్ కు నయనతార బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ విఘ్నేష్ వచ్చాడట. అతడిని దగ్గరి ఉండి రజనికి పరిచయం చేసిందట నయన్. అతనితో ఒక సినిమా చేయమని రజినీకాంత్‌పై ఒత్తిడి తెచ్చిందట. ఐతే తలైవా మాత్రం విఘ్నేష్ శివన్‌కు మంచి కథ ఉంటే పట్టుకురా అని చెప్పి పంపించేసాడట. విఘ్నేష్ మంచి దర్శకుడు అంటూ రజనీకు ఖాళీ దొరికినప్పుడల్లా అడగడం మొదలెట్టిందట. ఐతే.. ఈ మధ్యన మరోసారి నయనతార..రజినీకాంత్ దగ్గర విఘ్నేష్ టాపిక్ తేవడంతో రజనీ సీరియస్ అయ్యారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version