Site icon TeluguMirchi.com

భరత్ ను చూడబోతున్న రజనీ..

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని సెంటర్లలో మంచి కలెక్షన్స్ రాబడుతూ సరికొత్త రికార్డ్స్ వైపు పరుగులు పెడుతుంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ మూవీ రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి వార్తల్లో నిలిచింది.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళనాట కూడా భరత్ హావ కొనసాగుతున్నాడు. గత రెండు నెలలుగా తమిళ సినిమాలు రిలీజ్ కాకపోవడం తో తెలుగు సినిమాలకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. భరత్ అనే నేను కు సైతం మంచి వసూళ్లు వస్తుండడం , సినిమా చూసినవారంతా బాగుందని చెప్పడం తో ఈ మూవీ ని చూసేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్లాన్ చేసుకుంటున్నాడట. ఈ రెండు మూడు రోజుల్లోనే రజనీ ఈ మూవీ చూడబోతున్నాడని సమాచారం. కుదిరితే మహేష్ ఫ్యామిలీ సైతం రజనితో పాటు సినిమా చూడచ్చని అంటున్నారు.

రెండు సినిమాల ప్లాప్ తర్వాత మహేష్ కు వచ్చిన హిట్ మూవీ ఈ భరత్ అనే నేను..కొరటాల శివ డైరెక్షన్లో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీ కి దేవి సంగీతం అందించాడు.

Exit mobile version