ఇద్దరు దిగ్గజాలు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Kamal-rajini-phonecallతెలుగు , తమిళ ఇండస్ట్రీ లలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అగ్ర నటులు రజనీకాంత్ , కమల్ హాసన్లు. తమిళ ఇండీస్ట్రీ లో అయితే వీరిని దేవుళ్లతో కొలుస్తారు. వీరి నుండి సినిమా వస్తుందట సాధారణ ప్రేక్షకుడి నుండి థియేటర్లలో పల్లి అమ్ముకునే వాళ్ళ వరకు పండగే. అసలు వివరాల్లోకి వెళ్తే..

కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తూ పడిపోయిన కమలహాసన్ ను రజనీకాంత్ పరామర్శించారు. వ్యక్తిగతంగా వెళ్లి కలుసుకుందామనుకున్న రజని , ఈ ఆదివారం నాడే మరోసారి కమల్ కాలుకు డాక్టర్లు ఆఫరేషన్ చేశారు. దీంతో కలుసుకోలేకపోయిన రజని , ఫోన్ లో ఆయన కమల్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కమల్ కు ముందు ఆపరేషన్ చేసిన కాలు మళ్లీ నొప్పి పెరగడం తో వైద్యులు ఆదివారం మరోసారి ఆపరేషన్ చేశారు. ఫోన్ లో రజని మాట్లాడుతూ త్వరగా కోలుకోవాలని తిరిగి రెగ్యులర్ పనుల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.