Site icon TeluguMirchi.com

సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్

సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఇది. రజనీ రోబోకు సీక్వెల్ గా రానున్న 2.0 మూవీ రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డంతో, రజనీకాంత్ నుంచి సినిమా రాకుండానే ఈ ఏడాది ముగిసిపోతుందని తళైవ ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. అయితే ఇప్పుడు అదిరిపోయే న్యూస్ ఏమిటంటే .. రజనీకాలా వస్తున్నాడు. అవును.. 2.0 సినిమా కంటే ముందే, అంటే ఈ ఏడాదిలోనే కాలా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
“కాలా” రెగ్యులర్ షూటింగ్ ముంబయిలో మొదలైంది. షూటింగ్ కు ముందే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన యూనిట్.. షూటింగ్ మొదలైన మొదటి రోజు కూడా అదే ఊపు కొనసాగిస్తోంది.

ప్రస్తుతం ముంబయిలో కాలా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే చెన్నైలో వేసిన “థారావి సెట్”లో వెంటనే మరో షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఇలా గ్యాప్ ఇవ్వకుండా 4 నెలల్లో సినిమాను కంప్లీట్ చేసి, ఏడాది చివరినాటికి కాలాను థియేటర్లలోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు, మొత్తానికి 2017లో రజనీ సినిమా వుండబోతుందన్నమాట.

Exit mobile version