పాఠ్య పుస్తకాల్లో రజనీ జీవిత విషయాలు..

సూపర్ స్టార్ రజనీకాంత్ కు సంబందించిన ఎన్నో విషయాలు తమిళనాడు 5వ తరగతి పాఠ్య పుస్తకాల్లో పొందుపరిచారు. ఆయన ఏ స్థాయి నుండి వచ్చారో..ఎలాంటి కష్టాలు అనుభవించారో..ఆయన సినీ జీవితం ఎలా సాగిందనే విషయాలు అందులో చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు రజనీకాంత్ అనగానే ఒక సాధారణ బస్ కండక్టర్ నుండి వచ్చి..సినిమాల్లో సూపర్ స్టార్ రేంజ్ కి చేరుకున్నారని మాత్రమే తెలుసు. కానీ ఆయన బస్ కండక్టర్ కంటే ముందు కార్పెంటర్‌గా పనిచేసి ఆ తర్వాతే ఆయన కండక్టర్ అయ్యారట. ఈ విషయాన్నీ పాఠ్య పుస్తకాల్లో తెలిపారు. మరి ఇంకెన్ని విషయాలు తెలిపారనేది తెలియాల్సి ఉంది.

రోబో 2 .0 ముందు వరకు వరుస ప్లాప్స్ ఎదురుకున్న రజనీ..రోబొ 2.0 తర్వాత వరుస హిట్స్ కొడుతూ మళ్లీ బిజీ అయ్యారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో దర్బార్ అనే సినిమా చేస్తున్నాడు. ముంబై లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తమిళ్ తో పాటు తెలుగు లోను ఈ మూవీ రిలీజ్ కానుంది.