పోలీస్ గెటప్ లో రజనీ స్టయిల్ చూసారా..?

‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌, నయనతార జంటగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్‌’. ఈ చిత్రంలో రజనీకాంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా రజనీకాంత్ పోలీస్ గెటప్ లో ఉన్న పిక్ బయటకొచ్చి వైరల్ గా మారింది.

ఈ పిక్ లో రజనీ చాల యంగ్ గా కనిపిస్తూ..చాల స్టైలిష్ గా ఉన్నాడు. ఈ లుక్ చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రజనీకాంత్, మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముంబై బ్యాక్‌డ్రాప్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రజనీకాంత్‌కు కుమార్తెగా నటి నివేదా థామస్‌ నటిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తుండగా.. .లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. 2020 పొంగల్(సంక్రాంతి)కి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.