గుడ్ న్యూస్ : కబాలి ప్రమోషన్ లో పాల్గొనబోతున్న రజనీకాంత్

Rajini-comebackరజని ఫ్యాన్స్ కు అసలైన పండగా రాబోతుంది. ఇప్పటికే కబాలి మేనియా తో యావత్ ప్రపంచం ఊగిపోతున్న తరుణం లో మరో గుడ్ న్యూస్ ప్రకటించారు కబాలి చిత్ర యూనిట్. ఈ నెల 20 న రజనీకాంత్ అమెరికా నుండి ఇండియా కు రాబోతున్నాడు. నెల రోజుల క్రితం రోబో 2.0 చిత్ర షూటింగ్ కోసం వెళ్లిన రజని పై రకరకాల వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. వాటికి చెక్ పెడుతూ రజని మరో నాల్గు రోజుల్లో ఇండియా కు రాబోతున్నాడు..

వచ్చి రాగానే కబాలి చిత్ర ప్రమోషన్ లో పాల్గొనబోతాడు అని చిత్ర యూనిట్ చెపుతున్నారు..అలాగే ఫ్యాన్స్ కబాలి సంబరాలు జరిపేందుకు రెడీ అవుతున్నారు. మొత్తానికి రజని కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిజంగా పండగే అని చెప్పాలి.