Site icon TeluguMirchi.com

రాజమౌళి ముందు మిగతా డైరెక్టర్స్ అంత టీవీ డైరెక్టర్లే..

rajamouli

సంచలన దర్శకుడు..వివాదాస్పద వార్తలకు కేరాఫ్ అడ్రెస్ అయినా రామ్ గోపాల్ వర్మ కన్ను దర్శక ధీరుడు రాజమౌళి ఫై పడింది…రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీ బాహుబలి 2 మరో రెండో రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ నేపథ్యం లో వర్మ తన ట్విట్టర్ లో రాజమౌళి ఫై ఫోకస్ పెట్టాడు..నిన్నటికి నిన్న రాజమౌళి అందంగా ఉన్నారంటూ పొగిడిన వర్మ.. తాజాగా మరో ట్వీట్‌ చేశారు. ‘రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి.. దేశంలోని మిగతా దర్శకులందరినీ టీవీ సీరియల్‌ డైరెక్టర్లుగా ఫీల్‌ అయ్యేలా చేసింది’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

వర్మ ఇటీవల జక్కన్నతో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్టు చేస్తూ.. ‘నేను అసహ్యంగా ఉన్నాను. నాకంటే రాజమౌళే చాలా అందంగా ఉన్నారు’ అని ట్వీట్‌ చేశారు. అయితే వర్మ ట్వీట్‌కు స్పందించిన రాజమౌళి.. ‘ అయ్యా నన్ను ఒగ్గేయండయ్యా’ అంటూ సమాధానమిచ్చారు.

దేశ వ్యాప్తంగా సినీ లోకం ఎదురుచూస్తున్న బాహుబలి: ది క‌న్‌క్లూజ‌న్‌ ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా , రమ్య కృష్ణ , సత్య రాజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

Exit mobile version