రజనీ సెల్యూట్‌.. గాల్లో తేలుతున్న బాహుబలి

‘బాహుబలి 2’ ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రముఖులు, అభిమానులు చిత్రం అద్భుతంగా ఉందంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. అటు నేతలు కూడా బాహుబలి ని ప్రశంసిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ బాహుబలి ఫ్యాన్స్ లిస్టు లో చేరారు.

భారతదేశం గర్వించేలా ‘బాహుబలి’ చిత్రం తెరకెక్కించిన ఎస్‌.ఎస్‌ రాజమౌళిని దేవుడి బిడ్డ అని ప్రశంసించారు తలైవా రజనీకాంత్‌. బాహుబలి- ది కన్‌క్లూజన్‌ రికార్డుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంతో రజనీ ట్విటర్‌ వేదికగా రాజమౌళిని అభినందించారు. ‘బాహుబలి-2 భారతీయ సినీ రంగానికే గర్వకారణం. దేవుడి బిడ్డైన రాజమౌళికి, అతని బృందానికి నా సెల్యూట్‌’ అని ట్వీట్‌ చేశారు రజనీ.

దీనికి రాజమౌళి సమాధానం ఇస్తూ.. ‘తలైవా.. చెప్పాలంటే దేవుడే మమ్మల్ని ఆశీర్వదించినట్లు ఉంది. మా చిత్రబృందానికి గాల్లో తేలినట్టుంది. ఇంతకుమించి ఇంకేమీ ఆనందాన్ని ఇవ్వదు’ అంటూ రీట్వీట్ చేశారు.