బాహుబలి 2 లో రాజమౌళి తప్పు చేసాడు.

బాహుబలి మొదటి పార్ట్ విడుదల తర్వాత ప్రేక్షకుల్లో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఆ ప్రశ్నలతో బాహుబలి రెండో పార్ట్ చూసి అన్ని ప్రశ్నలకు సమాదానాలు తెలుసుకున్నాడు..బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో.. శివగామి చేసిన తప్పేంటో తెలిసింది.. సుబ్బరాజు క్యారెక్టర్ ఏంటో తెలిసింది.. బాహుబలి నిజంగా చనిపోయాడో లేదో కూడా తెలిసింది.. ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది ‘ది కంక్లూజన్’. కానీ ఒక్క ప్రశ్న మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. అసలు భల్లాలదేవుడి భార్య ఎవరన్నది మాత్రం ‘ది కంక్లూజన్’లో రాజమౌళి చూపించలేదు.

భల్లాలదేవుడికి భద్ర అనే కొడుకున్న సంగతి ఫస్ట్ పార్ట్ లో చూశాం. అడివి శేష్ చేసిన ఆ క్యారెక్టర్ని బాహుబలి చంపేయడం తెలిసిందే. రెండో భాగంలో శేష్ కనిపించడు కానీ.. అతడి తల మాత్రం కనిపిస్తుంది. దాన్ని తీసుకునే భల్లాలదేవుడి మీదకు మహేంద్ర బాహుబలి దండెత్తుతాడు. కొడుకు తల చూసి భల్లాల ఉగిపోతాడు ..అంతకుముందు ఎక్కడా కానీ భల్లాలదేవుడికి ఆ కొడుకును కనిచ్చింది ఎవరన్నది చూపించరు. అసలు అతడి పెళ్లికి సంబంధించిన ప్రస్తావనే ఉండదు. ఎప్పుడూ తండ్రితో కలిసే కనిపిస్తాడు భల్లాల. ఎక్కడా భార్య ప్రస్తావన ఉండదు. ఆ పాత్రను చూపించనే చూపించరు. అసలు ఆ క్యారెక్టర్ బతికి ఉందా లేదా అన్న ప్రస్తావన కూడా లేదు. మరి ఉద్దేశపూర్వకంగానే భల్లాల భార్య సంగతి పక్కనపెట్టేశారా.. లేక దాని సంగతి మరిచిపోయారా అన్నది రాజమౌళి కే తెలియాలి.