Site icon TeluguMirchi.com

Game Changer Trailer : ట్రైలర్‌లో ప్రతీ షాట్, సీన్‌ ఎగ్జైట్మెంట్‌ను ఇచ్చింది : రాజమౌళి


Game Changer Trailer : గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో గురువారం నాడు గేమ్ చేంజర్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

Glopixs : కొత్తగా మార్కెట్లోకి మరో ఓటీటీ ఫ్లాట్ ఫాం ‘గ్లోపిక్స్’..!

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ.. “శంకర్ గారు ఫస్ట్ తెలుగు సినిమా అని అంతా చెబుతుంటే.. అవునా? నిజమా? అని అనిపించింది. కానీ తెలుగు వాళ్లకి శంకర్ గారు తమిళ దర్శకుడు కాదు.. మన తెలుగు దర్శకుడే. శంకర్ గారు అంటే తెలుగు వారందరికీ గౌరవం. ఆ గౌరవంతోనే దిల్ రాజు గారు ఈ మూవీని శంకర్ గారితో తీసి ఉంటారు. ప్రస్తుతం ఉన్న కుర్ర దర్శకులు మమ్మల్ని చూసి గర్వపడుతుంటారు. కానీ మేం మాత్రం శంకర్ గారిని చూసి గర్వపడుతుంటాం. ఆయనే డైరెక్టర్లకు ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. మనకున్న పెద్ద కలల్ని సినిమాగా తీస్తే డబ్బులు వెనక్కి వస్తాయని అందరికీ కాన్ఫిడెంట్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్. ట్రైలర్‌ను రిలీజ్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు థాంక్స్. ఈ మూవీతో వింటేజ్ శంకర్ గారిని చూస్తాం. ఒకే ఒక్కడు నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ స్థాయిని మించేలా గేమ్ చేంజర్ ఉంటుందనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే.. ప్రతీ షాట్, సీన్‌ ఎగ్జైట్మెంట్‌ను ఇచ్చింది. మగధీర నుంచి ఆర్ఆర్ఆర్‌ వరకు రామ్ చరణ్ ఎంతో ఎదిగి పోయాడు. మగధీర టైంలో రామ్ చరణ్‌ను హీరో అని పిలుస్తూ ఉండేవాడ్ని. హెలికాప్టర్ నుంచి లుంగీ కట్టుకుని కత్తి పట్టుకుని దిగుతుంటే.. విజిల్స్ ఎలా వస్తాయో నాకు తెలుస్తోంది. జనవరి 10న థియేటర్లోకి గేమ్ చేంజర్ రాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి” అని అన్నారు.

Exit mobile version