Site icon TeluguMirchi.com

రాజమౌళి తొలిప్రేమ


వరుణ్ తేజ్, రాశి ఖన్నా జోడీగా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన తొలిప్రేమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ అందమైన ప్రేమకథపై ప్రముఖులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ జాబితాలోకి దిగ్గజ ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా చేరిపోయారు. తాను ప్రేమ కథలకు అభిమానిని కాదు కానీ, ‘తొలిప్రేమ’ చిత్రాన్ని మాత్రం ఇప్పటికీ ఆస్వాదిస్తున్నానని అంటున్నారు జక్కన్న.

‘ప్రేమ కథలకు నేను ఫ్యాన్ ని కాదు. కానీ, ‘తొలిప్రేమ’ చిత్రాన్ని ఆస్వాదిస్తున్నా. వెంకీ తన తొలి చిత్రమే చాలా చక్కగా తీశాడు. వరుణ్‌తేజ్‌ మరో మెట్టు ఎక్కాడు. అతని బలం పెరిగింది. రాశీఖన్నా అందంగా ఉంది. అంతేకాదు ఆమె అభినయం కూడా బాగుంది. ప్రసాద్‌గారు, బాపిలకు శుభాకాంక్షలు. మంచి నిర్మాణ విలువలతో తీసి, విజయానికి అన్ని విధాల అర్హత ఉందని నిరూపించారు” అని ట్వీట్ చేశారు

Exit mobile version