Site icon TeluguMirchi.com

రాజమౌళి నెక్స్ట్ మూవీ ప్రొడ్యూసర్ ఇతడే..

బాహుబలి మూవీ తో రాజమౌళి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది..రాజమౌళి తో సినిమా చేయడానికి పెద్ద పెద్ద డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు..ప్రేక్షకుల్లో కూడా బాహుబలి తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు..ఏ హీరో తో సినిమా చేస్తాడో అని అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారి ఆసక్తి కి తెరపడింది.

ప్రముఖ ప్రొడ్యూసర్ డి.వి.వి. దానయ్య బ్యానర్ లో రాజమౌళి నెక్స్ట్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది..అల్లు అర్జున్ తో చేస్తాడని అంటున్నారు కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ మూవీ తరువాత కె.ఎల్. నారాయణ తోమరో సినిమా చేయబోతున్నాడు. ఇది మాత్రం మహేష్ బాబు తో ఉండబోతుందని తెలుస్తుంది. మొత్తానికి బాహుబలి తర్వాత రాజమౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరో పక్క బాహుబలి మేనియా వారం రోజులు పూర్తి అయినా కానీ తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 850 కోట్ల కు పైగా కలెక్ట్ చేసి , సరికొత్త రికార్డ్స్ కు నాంది పలికింది.

Exit mobile version