ఇప్పట్లో నా వల్ల కాదు… ఎక్కడికైనా వెళ్లిపోతా

rajamouliతాజాగా టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా, సోషల్‌ మీడియాలో ఏది చూసినా కూడా ‘బాహుబలి’, ‘బాహుబలి’ అనే మాటనే వినిపిస్తోంది. తాజాగా ఈ చిత్ర రెండవ పార్టు ట్రైలర్‌ విడుదలయ్యింది. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తోంది.  ఈ చిత్రంతో రాజమౌళి క్రేజ్‌ ఎ్కకడికో వెళ్లిపోయింది. ట్రైలర్‌ విడుదలయిన ఆరు గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి కోటికి పైగా వ్యూస్‌ వచ్చాయి. అంతేకాకుండా 3.5లక్షల లైకులు సొంతం అయ్యాయి. ఈ స్పందనను చూసిన ‘బాహుబలి’ యూనిట్‌ అంతా కూడా పండగ చేసుకుంటున్నారు. తాజాగా ట్రైలర్‌ స్పందనను చూసి మాట్లాడిన రాజమౌళి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మా కష్టార్జితంకు తగిన ఫలితం ఇచ్చారు అని ప్రేక్షకులకు కృతజ్ఞలు తెలిపారు.

తాజాగా తదుపరి చిత్రం గురించి మాట్లాడుతూ… తర్వాతి చిత్రం చాలా సింపుల్‌గానే ఉంటుంది అని క్లారిటీ ఇచ్చాడు. ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే ప్రశ్న అడగగా బాబోయ్‌.. ఇప్పట్లో నా వల్ల కాదు… ఎక్కడికైనా వెళ్లిపోవాలి అని వ్యాఖ్యానించాడు. అయిదేళ్ల నుండి తిండి, నిద్ర లేకుండా ‘బాహుబలి’కే అంకితం చేశాను. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఒత్తిడిలు ఇక నా వల్ల కాదు. సినిమా విడుదల కాగానే ఎక్కడికైనా వెళ్లి పోయి ప్రశాంతంగా జీవితాన్ని ఓ మూడు నెలల పాటు గడుపుతాను అంటూ చెప్పుకొచ్చాడు. ‘బాహుబలి’ మేము చేసిన కష్టం వర్ణనాతీతం, అందుకు తగిన ఫలితం వచ్చినందుకు అవన్నీ కూడా మర్చిపోయాం అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.