Site icon TeluguMirchi.com

రాజమౌళితో సూపర్‌స్టార్‌ సినిమా ఉంది… ఇది ఫిక్స్‌!

‘బాహుబలి’ చిత్రానికి ముందు కూడా తెలుగులో రాజమౌళికి పిచ్చ క్రేజ్‌ . ఇక ‘బాహుబలి’ చిత్రం తర్వాత కేవలం తెలుగులోనే కాకుండా అన్నిభాషల్లో కూడా రాజమౌళి క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇకపోతే రాజమౌళి తదుపరి చిత్రం గురించి అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి ఫారెన్‌ టూర్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. ‘బాహుబలి’ మొదటి పార్టు విడుదలయిన సమయంలో తాను సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్దంగా ఉన్నాను అని తెలిపాడు. కానీ రెండో పార్టు పూర్తి అయ్యాక ఆ ఊసే ఎత్తడం లేదు. దాంతో మహేష్‌ అభిమానులు రాజమౌళితో మహేష్‌ సినిమా ఉంటుందా..?? లేదా అనే సందేహంలో ఉన్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళితో సూపర్‌స్టార్‌ చిత్రం ఉంటుంది, వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది అని తెలుస్తోంది. గతంలో నిర్మాత కెఎల్‌ నారాయణకు రాజమౌళి ఓ సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడట. ఇప్పుడు కూడా జక్కన్న అందుకు సముఖంగానే ఉన్నాడు. ఈ నిర్మాత మహేష్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో చేయడానికి తెగ తాపత్రయ పడుతున్నాడు. అందుకు మహేష్‌ కూడా ఒకే చెప్పాడు. కాబట్టి వచ్చే ఏడాది మహేష్‌, రాజమౌళిల చిత్రం కచ్చితంగా ఉంటుంది ఇది ఫిక్స్‌ అని తెలుస్తోంది. రాజమౌళి ఒక సినిమా పూర్తి చేశాక, మహేష్‌ కొరటాల సినిమా పూర్తి అయ్యాక రాజమౌళి, మహేష్‌ల చిత్రం ఉంటుంది అని టాక్‌.

Exit mobile version