Site icon TeluguMirchi.com

సూర్య కు రాజమౌళి సాయం ..

గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న సూర్య..తాజాగా నటించిన ఎన్జికె చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నప్పటికీ ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులోనూ ప్లాప్ అయ్యింది. దానితో ప్రస్తుతం చేస్తున్న కెవి ఆనంద్ మూవీ ఫైన ఆశలన్నీ పెట్టుకున్నాడు.

కాప్పన్ తెలుగు వెర్షన్ టైటిల్ ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో రేపు ఉదయం 10.30కి రాజమౌళి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రివీల్ చేయబోతున్నారు. చాలా రోజుల క్రితమే తమిళ్ వెర్షన్ టీజర్ వచ్చింది. కానీ తెలుగు డబ్బింగ్ హక్కులకు సంబంధించి ఇంకా లావాదేవీలు పూర్తి కానందున అప్పటి నుంచి ఇది పెండింగ్ లో ఉంది. .

సూర్య సెక్యూరిటీ ఆఫీసర్ గా మోహన్ లాల్ ప్రధాన మంత్రిగా ఆర్య మరో కీలక పాత్రలో నటిస్తున్న కాప్పన్ దేశ భద్రతకు సంబందించిన థీమ్ తో రాబోతోంది. లైకా ప్రొడక్షన్ బ్యానర్ ఫై సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సాయేషా ఇందులో హీరోయిన్ గా నటించింది. హరీస్ జైరాజ్ సంగీతం అందించారు.

Exit mobile version