Site icon TeluguMirchi.com

తెలుసా… రాజమౌళికి గర్వం కూడా ఎక్కువే

rajamouliప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు రాజమౌళి ఏ చిత్రాన్ని తెరకెక్కించినా కూడా ఘన విజయం సాధిస్తుంది అనే టాక్‌ ఎప్పటి నుండో ఉంది. ఇక ‘బాహుబలి’ చిత్రంతో రాజమౌళి అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడిగా మారాడు. తాను తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలే సాధించినా కూడా పైకి చూడడానికి చాలా వినయంగా, కూల్‌గా కనిపిస్తాడు. దాంతో రాజమౌళికి టెన్షన్‌, గర్వం అసలే లేదు అని అంతా అనుకుంటారు. కానీ రాజమౌళికి ఈ రెండు ఉన్నాయని ఆయన సతీమణి రమా రాజమౌళి చెప్పుకొచ్చింది. సినిమాపై ఎన్ని అంచనాలుంటే టీంకు అంత టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. విడుదలయ్యాక ఆ ఫలితం ఎలా ఉంటుంది అనేది అందరికి కూడా భయం ఉంటుంది.

రాజమౌళి కూడా తాను తెరకెక్కించిన చిత్రం ఎంతటిదైనా కూడా చాలా టెన్షన్‌ పడుతారు, కానీ పైకి మాత్రం కూల్‌గా కనిపిస్తారు. అంతేకాకుండా తాను తెరకెక్కించిన సినిమాలు విజయాన్ని సాధిస్తుంటే ఆయన కూడా గర్వంగా ఫీలవుతారు. తన చిత్రాలు ఇలా విజయం సాధిస్తున్నాయని చాలా ఫీల్‌ అవుతాడు. ఆ తర్వాత తన మీద ఉన్న నమ్మకాన్ని అలాగే ఉంచుకోవాలని తదుపరి చిత్రాల కోసం ఆరాటం పడతాడు. అందుకే రాజమౌళికి గర్వం లేదు అని అంతా అనుకుంటారు. ఆయనకు కూడా గర్వం, టెన్షన్‌ రెండూ బాగానే ఉంటాయి అని రమాగారు చెప్పుకొచ్చారు.

Exit mobile version