Site icon TeluguMirchi.com

రాజమౌళి ఫ్యామిలీ టూర్ ఎక్కడికో తెలుసా..?

ఐదేళ్లు గా రాజమౌళి ఫ్యామిలీ బాహుబలి తోనే గడిపారు..నిన్నటి తో వారి ఐదేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది..ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి ప్రభంజనం సృష్టిస్తుంది..ఎక్కడ చూసిన ఎక్కడ వినం జయహో రాజమౌళి అంటున్నారు…రాజమౌళి స్థాయి టాలీవుడ్ నుండి హాలీవుడ్ స్థాయి కి చేరుకుంది. ఏ డైరెక్టర్ కైనా ఇంతకన్నా ఏం కోరుకుంటారు..చెప్పండి. అందుకే ఈ సంతోషాన్ని ఫ్యామిలీ తో సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు.

రాజమౌళి ఆయన టోటల్ ఫ్యామిలీ మెంబర్లు అందరూ కలిసి భూటాన్ వెళ్తున్నారట. భూటాన్ అంటే ఎలా వుంటుందో తెలిసిందే. అది కూడా బాహుబలి సినిమా చూసినట్లే వుంటుంది. మిగిలిన దేశాల మాదిరిగా కాకుండా, కొండలు, లోయలు, పచ్చదనం, పవిత్ర ఆరామాలు ఇలాంటి డిఫరెంట్ లొకేషన్ అది. అందుకే రాజమౌళి అక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసాడు..ఐదేళ్ల కష్టాన్ని ప్రశాంతమైన వాతావరణం తో గడిపితే బాగుందని అంత అనుకున్నారట.

Exit mobile version