రాజమౌళి – రజనీకాంత్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవల కొంతమంది తమిళ నిర్మాతలు రాజమౌళితో ఈ విషయం గురించి చర్చించారని టాక్ వినిపించింది. అయితే ఈ విషయంపై ఎట్టకేలకు రాజమౌళి నోరు విప్పాడు. భారత సినీ రంగంలోని టాప్ స్టార్స్ లో ఒకరైన రజనీకాంత్ తో సినిమా చేయాలని ఏ డైరెక్టర్ అయినా కోరుకుంటాడని, రజనీతో సినిమా చేయాలనే కోరిక తనకు కూడా ఉందని… ఆయన ఇమేజ్ కు తగ్గ కథ దొరికితే తప్పకుండా సినిమా చేస్తానని చెప్పాడు.
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు స్పందించిన రాజమౌళి.. రాజమౌళి.. రజనీతో సినిమా అవకాశం వస్తే తన కన్నా సంతోషించే వ్యక్తి మరొకరు ఉండరని చెప్పారు. సో… రజనీ – రాజమౌళి సినిమా అనేది పక్కా. అయితే అదెప్పుడన్నది కాలమే చెప్పాలి.రోబో తర్వాత పా రంజిత్ తో ఓ సినిమా ఒప్పుకున్నాడు రజనీ. ఒకవేళ రాజమౌళి ఎస్ అంటే ఈ సినిమా స్థానంలోనే ఈ క్రేజీ కాంబినేషన్ ఫిక్స్ అయిపోవచ్చు.