Site icon TeluguMirchi.com

టెంపర్ బెనిఫిట్ షోకి రాజమౌళి

Rajamouli-Temperఎన్.టి.ఆర్ – పూరి కాంబినేషన్ లో పవర్ ఫుల్ పవర్ ప్యాక్ తో వస్తున్న చిత్రం ‘టెంపర్’ . ఈ చిత్రం లో ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ దయా గా నటించగా అనిమల్ లవర్ గా కాజల్ నటిస్తుంది.

తాజాగా ఈ చిత్ర బెనిఫిట్ సంబంధించిన న్యూస్ ఇప్పుడు అబిమానుల అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఆడియో ఫంక్షన్ లో చిత్ర నిర్మాత బండ్ల గణేష్ అనౌన్స్ చేసిన టైం ప్రకారం కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో 13వ తేదీన ఉదయం 5:07 గంటలకే బెనిఫిట్ షో వేస్తునంటు సమాచారం.

అంతేకాకుండా ఈ షో కి దర్శక ధీరుడు రాజమౌళి మరియు రామ్ గోపాల్ వర్మ వస్తున్నారని యూనిట్ వర్గాలు చెపుతున్నారు. నిన్న సెన్సార్ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుని ‘యు/ఏ’ సర్టిఫికేట్ తీసుకుంది. ఇక చిత్ర రన్ టైం ఓ సారి చూస్తే.. ఫస్ట్ హాఫ్ 1 గంట08 నిమిషాలు, సెకండాఫ్ 1 గంట 13 నిమిషాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ నెల 13 టెంపర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాద్ షా చిత్రం తర్వాత మూడోసారి ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. గత కొంతకాలంగా ఎన్టీఆర్ నుండి సరియన హిట్ లేకపోవడం తో అబిమానులు ఓ హిట్ కోసం ఆకలితో ఉన్నారు..వారి ఆకలి తీర్చే సినిమా ఈ టెంపర్ అవుతుందని ట్రైలర్స్ , పిక్స్ చూస్తే అర్ధమవుతుంది.

Exit mobile version