Site icon TeluguMirchi.com

ఆ డైరెక్టర్‌ను జక్కన్న ఆకాశానికి ఎత్తేశాడు

టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియాస్ట్‌ బెస్ట్‌ డైరెక్టర్స్‌ జాబితా తీస్తే అందులో ఖచ్చితంగా రాజమౌళి పేరు ఉంటుంది. అపజయమే ఎరుగకుండా అద్బుతమైన విజయాలతో, ప్రపంచ స్థాయిలో టాలీవుడ్‌ను నిలిపి దర్శక ధీరుడుగా పేరు దక్కించుకున్న దర్శకుడు రాజమౌళి. అలాంటి రాజమౌళి చేత ఒక దర్శకుడు పొగడబడ్డాడు అంటే అది ఎంత అదృష్టంగా భావించాలి. అలాంటి అదృష్టం సాహో డైరెక్టర్‌ సుజీత్‌కు దక్కింది. తాజాగా జరిగిన సాహో ప్రీ రిలీజ్‌ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ దర్శకుడు సుజీత్‌ గురించి ఎక్కువ మాట్లాడటం జరిగింది.

సుజీత్‌ చాలా చిన్న పిల్లాడు, అనుభవం లేదు ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను ఎలా హ్యాండిల్‌ చేస్తాడని అనుకున్నారు. కాని అతడు ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్‌ ఎలా చేశాడనే విషయం ట్రైలర్‌తో అర్థం అయ్యింది. అంత పెద్ద బడ్జెట్‌, భారీ టెక్నీషియన్స్‌, తారాగణం అంతా కూడా మెయింటెన్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇదో గొప్ప అద్బుతంగా రాజమౌళి అభివర్ణించాడు. సుజీత్‌ ఒక ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌ మాదిరిగా ఈచిత్రంను తెరకెక్కించాడు. కంగ్రాట్స్‌ సుజీత్‌. ఫెంటాస్టిక్‌ జాబ్‌ అంటూ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు.

Exit mobile version