Site icon TeluguMirchi.com

Raj Tarun : లావణ్య తో రిలేషన్ లో వున్నా.. కానీ..


తనను మోసం చేశాడు అంటూ లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. మేమిద్దరం 11 ఏళ్ళుగా రిలేషన్ లో ఉన్నామని.. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వేరే అమ్మాయితో ఉంటున్నాడ‌ని.. తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది.

Also Read : ‘కల్కి 2’ లో కృష్ణుడిగా మహేష్ బాబు.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ ?

దీనిపై స్పందించిన రాజ్ తరుణ్.. ‘ప్రేమించి మోసం చేశాడంటూ తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. అయితే లావణ్య తో రిలేషన్లో ఉన్నమాట వాస్తవమే. లావణ్య నాకు పేస్ బుక్ లో పరిచయం. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో తను నాకు సహాయం చేసింది. కానీ అప్పుడు మా మధ్య ఏమీ లేదు. ఉయ్యాల జంపాల సినిమా రిలీజ్ తర్వాత అంటే 2014 నుండి 2017 వరకు కలసి ఉన్నాం. కానీ కొంతకాలంగా ఆమె డ్రగ్స్ వాడుతోంది. అలాగే మస్తాన్ సాయి అనే అతనితో అఫైర్ పెట్టుకుంది. అందుకే ఆమెను దూరం పెట్టాను. లావణ్యకు కేవలం డబ్బులు మాత్రమే కావాలి. అందుకే ఈ డ్రామా. లావణ్య నన్ను చాలా టార్చర్ పెట్టింది. కన్నతండ్రిని కూడా మోసం చేసింది. ఈ విషయాలన్నీ పోలీసులకు చెబితే నా రిప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుందోననే భయపడి చెప్పలేదు. నేను లీగల్ గా ఫైట్ చేస్తాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి’ అని కోరారు.

Also Read : బింబిసార2.. ప్రీక్వెల్‌ అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్ !

Director Nag Ashwin Interaction with Media | Q&A with Nag Ashwin  #kalki2898ad #prabhas

Exit mobile version