లాస్యతో ప్రేమంటే పెళ్లి కూడా చేస్తామన్నారట!!

rajtarunయంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌కు కెరియర్‌లో మంచి గుర్తింపు వస్తున్న కూడా ఏదో వివాదంతో తరుచుగా మీడియాలోకి వస్తూనే ఉంటాడు. గతంలో ఈయనకు తెలుగు యాంకర్‌ లాస్యకు పెళ్లి అయ్యిందని పుకార్లు జోరుగా ప్రచారం అయ్యింది. అంతేకాకుండా లాస్య, రాజ్‌తరుణ్‌ల ఒక ఫొటోను తగిలించి నిప్పులేనిదే పొగ రాదుగా అంటూ రాజ్‌తరుణ్‌, లాస్యలకు పెళ్లి అయినట్ట ప్రచారం చేశారు. ఈ పుకారుపై ఇదివరకే రాజ్‌తరుణ్‌ ఒకసారి వివరణ ఇచ్చాడు. లాస్య కూడా మా ఇద్దరికి ఎందుకు జత కట్టాలి అనిపించిందో అసలు తనకు నాకు పరిచయమే లేదు అని స్పష్టం చేసింది. ఇది ఎవరో కావాలనే చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

తాజాగా మీడియాతో ముచ్చటించిన రాజ్‌తరుణ్‌ మరోసారి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. లాస్యతో రహస్యం వివాహం అయ్యిందనే పుకారు తన దగ్గరి స్నేహితులను కూడా నమ్మేలా చేసిందట. చాలాకాలం కూడా బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడ్డాడట. కొంతమంది స్నేహితులైతే లాస్యతో లేచిపోయి వస్తే పెళ్లి కూడా చేస్తాము అంటూ ఫోన్‌లు చేసి హామి ఇచ్చారట. అసలు ఎందుకు లాస్యతో సంబంధం కలిపారో తనకు ఇప్పటికి కూడా తెలియదట. లాస్యను ఈయన కేవలం ఒకేఒకసారి ‘కుమారి 21ఎఫ్‌’ ఆడియో వేడుకలో మాత్రమే కలిశారట. అప్పటి ఒక ఫొటోనే పక్కన ఉన్న నోయెల్‌ను కట్‌ చేసి మరీ ఇలాంటి ప్రచారం చేశారు. కాని ఇది అబద్దమని అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డానని, ఇది నిప్పులేని పొగలాంటి వార్త అని రాజ్‌తరుణ్‌ కొట్టిపారేశాడు.