Site icon TeluguMirchi.com

‘మిర్చి’లో వాన ఫైట్ జోడిస్తారట

mirchi movie rain fightప్రభాస్ అభిమానులకు శుభవార్త. ‘మిర్చి’ లో ఓ సరి కొత్త యాక్షన్ సన్నివేశం చూడొచ్చు.  నిడివి ఎక్కువయ్యిందని ‘మిర్చి’లో ఓ భారీ యాక్షన్ ఘట్టానికి కత్తెర వేశారు. ఇప్పుడు ఆ ఫైట్ ని జోడించాలని భావిస్తున్నారు. ఈ విషయం ప్రభాస్ స్వయంగా చెప్పాడు. “ఆ ఫైట్ వాన లో షూట్ చేశాం. చాలా బాగా వచ్చింది. అయితే నిడివి సమస్య వల్ల ఇష్టం లేకపోయినా తొలగించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ఫైట్ జోడించాలని ఆలోచిస్తున్నాం” అన్నాడు ప్రభాస్. రూ. కోటి రూపాయల వ్యయంతో తీర్చిదిద్దిన వాన ఫైట్ జోడిస్తే వసూళ్లు కుడా కాస్త పెరుగుతాయి. ఆ ఫైట్ కనీసం ఇలాగైనా సార్ధకం చేసుకోవచ్చు అని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ సరి కొత్త పోరాట ఘట్టం ‘మిర్చి’ రేంజ్‌ ని ఏమాత్రం పెంచుతుందో చూద్దాం.
Exit mobile version