హీరో గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్.. ‘చి.ల.సౌ’ తో డైరెక్టర్ గా మారి హిట్ అందుకున్నాడు. ఈ హిట్ తో కింగ్ నాగార్జున ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా `మన్మథుడు 2`ను తెరకెక్కించాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ అయ్యింది.
దీని తర్వాత రాహుల్ ఎలాంటి సినిమా చేస్తాడో అని అంత అనుకుంటున్నా టైం లో ఈయన ఓ వెబ్ సిరీస్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడట. నెట్ఫ్లిక్స్ కోసం ఒరిజినల్ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించబోతున్నాడట. అయితే ఈ వెబ్ సిరీస్ యొక్క పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఆ కథ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి . మన్మథుడు 2 తర్వాత రాహుల్ నాని తో ఓ సినిమా చేయబోతున్నాడని..హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుందనే వార్తలు వినిపించాయి కానీ మళ్లీ ఏమైందో గాని ఆ ఊసే లేకుండా పోయాయి. ఇప్పుడు వెబ్ న్యూస్ బయటకు వచ్చింది.