Site icon TeluguMirchi.com

రింగ్‌ ఇచ్చి పునర్నవికి రాహుల్‌ ప్రపోస్‌

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 మూడవ వారం ముగింపు దశకు వచ్చింది. ఈ వారంలో తమన్నా ఎలిమినేట్‌ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఎలిమినేషన్‌లో ఉన్న రాహుల్‌, పునర్నవిలు ఏమాత్రం చింత లేకుండా సరదాగా టైంను గడిపేస్తున్నారు. వీరిద్దరు చాలా సరదాగా రొమాంటిక్‌గా ఉంటున్నారు. వీరిద్దరు డేటింగ్‌ అంటూ చర్చించుకోవడం, డేటింగ్‌కు వస్తావా అంటూ మాట్లాడుకోవడం అంతా కూడా సరదాగా సాగిపోతుంది. ఇలాంటి సమయంలో తాజాగా ఒక సందర్బంగా పునర్నవికి ప్రపోస్‌ చేయాలని రాహుల్‌ భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

బయటకు వెళ్లిన తర్వాత రింగ్‌ తీసుకు వచ్చి ప్రపోస్‌ చేస్తే నీ రియాక్షన్‌ ఏంటీ అంటూ రాహుల్‌ ప్రశ్నించాడు. అందుకు పునర్నవి స్పందిస్తూ పో.. పోయి నీ పని చూసుకో అంటానంటూ సరదాగా కామెంట్‌ చేసింది. రాహుల్‌ చాలా కామెంట్స్‌ చేసినా కూడా పునర్నవి మాత్రం చాలా కూల్‌గా ఉంటుంది. అతడితో స్నేహం కంటిన్యూ చేస్తోంది. ఇద్దరి మద్య కెమిస్ట్రీ ఉండబట్టే రాహుల్‌ ఏమన్నా కూడా పునర్నవి కూల్‌గా తీసుకుంటుందని అంటున్నారు. చాలా గడుపు పిండం అయిన పునర్నవి మెల్లగా రాహుల్‌ మాయలో పడనుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Exit mobile version