నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తన వంతు సాయంగా ₹మూడు కోట్ల రూపాయాలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.
అందులో పీఎం-కేర్స్ ఫండ్‌కు ₹50 లక్షలు, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ₹50 లక్షలు, ఫెఫ్సి యూనియన్‌కు ₹50 లక్షలు, డ్యాన్సర్స్ యూనియన్‌కు ₹50 లక్షలు, తన దగ్గర ఉన్న దివ్యాంగులకు ₹25 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తన సొంత ఊరు రోయపురానికి చెందిన దినసరి కూలీలు, ప్రజల కోసం ₹75 లక్షలు వెచ్చించనున్నట్లు లారెన్స్ తెలిపాడు.
కాగా తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 834కి చేరింది. అందులో ఈ రోజు కొత్తగా నమోదైనవి 96 కేసులు. వీరిలో 80 మంది నిజాముద్దీన్ మర్కజ్‌కు సంబంధించినవారేనని సమాచారం.