లారెన్స్ కు ఛాన్స్ ఇచ్చిన రజనికాంత్..?

rajinikanth-Laranceకొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడిగా ఇలా అన్ని రంగాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాఘవ లారెన్స్. ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ విజయం పొందుతున్న లారెన్స్ ఇటివలే గంగ చిత్రం తో మరో మెట్టుకు ఎక్కాడు.

తాజాగా గంగా (మునీ-3) చిత్రాన్ని చూసిన రజనికాంత్ లారెన్స్ ను మెచ్చుకోవడమే కాకుండా, తనతో ఓ సినిమా చేస్తా అని మాట ఇచ్చాడట. దీంతో లారెన్స్ సంతోషానికి అవధులేకుండా పోయాయట. ప్రస్తుతం గంగ సక్సెస్ లో మునిగితేలుతున్న లారెన్స్ త్వరలోనే రజిని కి ఓ మంచి కథ రెడీ చేసి వినిపించానున్నాడని కోలీవుడ్ టాక్.